Sun Dec 22 2024 22:54:27 GMT+0000 (Coordinated Universal Time)
ఆహ్వానించి అవమానించారు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును అధికారులు అవమానించారు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును అధికారులు అవమానించారు. ప్రధానికి స్వాగతం చెప్పేందుకు అచ్చెన్నాయుడు హెలికాప్టర్ కు వచ్చి వెనుదిరిగి వెళ్లిపోాయారు. ప్రధానికి ఆహ్వానం పలికే జాబితాలో అచ్చెన్నాయుడు పేరు లేదని అక్కడి అధికారులు చెప్పారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాత్రం తనను హెలిప్యాడ్ కు రావాల్సిందిగా కోరారని అచ్చెన్ాయుడు తెలిపారు. జిల్లా కలెక్టర్ కు అందిన జాబితాలో తన పేరు లేదని చెప్పడంతో అచ్చెన్నాయుడు వెనుదిరిగి వెళ్లిపోయారు.
ఎస్పీజీ జాబితాలో....
ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీకి ఇచ్చిన జాబితాలోనూ అచ్చెన్నాయుడు పేరుంది. అయితే తనకు ఇచ్చిన జాబితాలో అచ్చెన్నాయుడు పేరు లేదని కలెక్టర్ చెబుతున్నారు. దీంతో అచ్చెన్నాయుడు తన హోటల్ గదిగే పరిమితమయ్యారు. ఆహ్వానించి అవమానించడమేంటని తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తన పేరు లేకపోవడమేంటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
Next Story