Wed Dec 18 2024 22:13:50 GMT+0000 (Coordinated Universal Time)
శివరాం.. ఇదేం ఛీటింగ్?
కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామ్ పై తెనాలి పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు
కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామ్ పై తెనాలి పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన కంపెనీలో తమ చేత పెట్టుబడి పెట్టంచి శివరాం మోసం చేశాడంటూ బాధితులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
2016లో పెట్టుబడి రూపంలో...
శివరామ్ కు చెందిన కైరా కంపెనీలో 2016లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పాలడుగు బాలవెంకట సురేష్ 25 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టుబడి పెట్టారు. వీరితో పాటు మరో ముగ్గురు కోటి రూపాయల వరకూ కోడెల శివరాం కంపెనీలో పెట్టుబడిగా పెట్టారు. చెక్కుల ద్వారానే ఈ మొత్తాన్ని చెల్లించారు. మరుసటి ఏడాది పెట్టుబడి ఫలితం ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ శివరాం అతని భార్య ఎంతకూ డబ్బులు చెల్లించకపోవడంతో బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Next Story