Tue Dec 24 2024 02:14:54 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద టెన్షన్
విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. కాంట్రాక్టు కార్మికులను తొలగింపునకు నిరసనగా ఆందోళన చేపట్టారు
విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. స్టీల్ ప్లాంట్ లోని కాంట్రాక్టు కార్మికులను తొలగింపునకు నిరసనగా ఆందోళన చేపట్టారు. ఈడీ వర్క్స్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ఈడీ వర్క్స్ కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. విశాఖ సెక్యూరిటీ సిబ్బందితో పాటు పోలీసులు కూడా వచ్చి ఆందోళన చేస్తున్న కార్మికులను అదుపులోకి తీసుకున్నారు.
కార్యాలయాల అద్దాలు ధ్వంసం...
విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు 4 వేలకు మందికిపైగా తొలగించేందుకు యాజమాన్యం సిద్ధం కావడంతో కార్మిక సంఘాలు ఈ ఆందోళనకు పిలుపు నిచ్చాయి. గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న కార్మికులు నేడు ఉధృతం చేయడంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలకు పోలీసులు దిగుతున్నారు.
Next Story