Wed Jan 15 2025 15:57:37 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ నేత హౌస్ అరెస్ట్.. అక్కడ 144 సెక్షన్
గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత తలెత్తింది. టీడీపీ నేత అరవిందబాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత తలెత్తింది. దుర్గికి వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ నేత అరవిందబాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ ఇన్ ఛార్జిగా ఉన్న అరవిందబాబు దుర్గికి వెళ్లేందుకు ప్రయత్నించారు. నిన్న దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వసం చేశారు.
చలో దుర్గి....
దీనికి నిరసనగా టీడీపీ చలో దుర్గి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. టీడీపీ శ్రేణులు ఆందోళనకు సిద్ధమయిన సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే దుర్గిలో 144వ సెక్షన్ ను విధించారు.
- Tags
- aravind babu
- tdp
Next Story