Mon Dec 23 2024 09:08:24 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యే కోటంరెడ్డి హౌస్ అరెస్ట్
నెల్లూరులోని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీగా మొహరించారు
నెల్లూరులోని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీగా మొహరించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి అభిమానులు, కార్యకర్తలు. నెల్లూరు రూరల్ పరిధిలో పొట్టేపాల్లెం కలుజు మరమ్మతుల కోసం నిరసన తెలుపుతూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేడు జలదీక్ష చేసేందుకు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.
దీక్షకు అనుమతి లేదని...
కోటంరెడ్డి దీక్ష కు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని దీక్ష చేపట్ట కుండా తెల్లవారుజామున ఆయన ను హౌస్ అరెస్టు చేశారు. సమాచారం అందుకున్న ఆయన అభిమానులు, కార్యకర్తలు పెద్దయెత్తున తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. .ప్రస్తుతం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు, కార్యకర్తలు భారీగా ఉన్నారు.
Next Story