Wed Apr 09 2025 14:25:26 GMT+0000 (Coordinated Universal Time)
మాడుగులలో కొనసాగుతున్న టెన్షన్
అనకాపల్లి జిల్లా మాడగుల లో ఉద్రిక్తత కొనసాగుతుంది. వైసీపీ కూటమి పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకునే అవకాశముంది

అనకాపల్లి జిల్లా మాడగుల లో ఉద్రిక్తత కొనసాగుతుంది. నిన్న బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు రెండు పార్టీల మధ్య ఘర్షణ జరగడంతో నేడు కూడా ప్రచారాన్ని అడ్డుకుంటామని ఇరు వర్గాలు ప్రకటించాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈరోజు మాడుగుల వైసీపీ అభ్యర్థి డిప్యూటీ సీఎం కుమార్తె అనూరాధ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటామని కూటమి నేతలు హెచ్చరించారు.
రెండు పార్టీల మధ్య...
సీఎం రమేష్ వాహనాన్ని నిన్న ధ్వంసం చేసిన నేపథ్యంలో అందుకు ప్రతిగా ఆమె ప్రచారాన్ని అడ్డుకుంటామని కూటమి నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీ ఎత్తున మొహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యగా పోలీసులను రంగంలోకి దించారు.
Next Story