Fri Dec 20 2024 12:37:16 GMT+0000 (Coordinated Universal Time)
Punganur : పుంగనూరులో అదే టెన్షన్..నేడు కూడా మిధున్ రెడ్డి
పుంగనూరు లో టెన్షన్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉద్రిక్తతలు తగ్గడం లేదు.
పుంగనూరు లో టెన్షన్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉద్రిక్తతలు తగ్గడం లేదు. నిన్నటి నుంచి రాళ్లు రువ్వుకోవడం, వాహనాలు ద్వసం చేయడం... నియోజకవర్గం లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈరోజు మరోసారి సదుంకి పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రానున్నారు.అయితే మిధున్ రెడ్డి రాకను అడ్డుకుంటామని టిడిపి నేతల హెచ్చరికలు చేశారు. దీంతో మిథున్ రెడ్డి పర్యటన కు పోలీసులు అనుమతి లేదని తెలిపారు.
ఇరు వర్గాలపై...
పుంగనూరులో నిన్న జరిగిన టిడిపి,వైసీపీ పరస్పర దాడుల్లో పోలీసులు కేసులు నమోదు చేశారు..మాజీ ఎంపీ.రెడ్డప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు 9 మందితో సహా మరికొందరి టిడిపి నాయకుల పై ఎస్సీ,ఎస్టీ తో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. టీడీపీ నాయకుడు సుహేల్ భాష ఫిర్యాదు మేరకు హత్య యత్నం తో సహా పలు సెక్షన్ల కింద మిథున్ రెడ్డి,.మాజీ ఎంపీ ఎన్,రెడ్డప్ప తో సహా 34 మంది పై కేసు నమోదు చేశారు పోలీసులు.
Next Story