Mon Dec 23 2024 04:23:31 GMT+0000 (Coordinated Universal Time)
కారంపూడిలో టెన్షన్.. వైసీపీ, టీడీపీ క్యాడర్ మధ్య ఘర్షణ
పల్నాడు జిల్లా కారంపూడి లో ఉద్రిక్తత కారంపూడి లోని తెలుగుదేశం, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది
పల్నాడు జిల్లా కారంపూడి లో ఉద్రిక్తత కారంపూడి లోని తెలుగుదేశం, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. తెలుగుదేశం పార్టీ నేత గోరంట్ల నాగేశ్వరావు చెందిన స్కార్పియోను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. మాజీ ఎంపీపీ భర్త మేకల శ్రీనివాసరెడ్డి స్కార్పియో వాహనాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేశారు.
వాహనాల ధ్వంసం...
దీంతో కారంపూడిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘర్షణల నేపథ్యంలో పోలీసులు కారంపూడిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కారంపూడి బస్టాండ్ సెంటర్ లో ఇప్పటికే వైసీపీ క్యాడర్ మొహరించి ఉంది. బస్ డిపో వద్ద టీడీపీ కార్యకర్తలు ఆయుధాలతో ఉన్నారు. దీంతో వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్బంగా స్వల్ప లాఠీఛార్జి పోలీసులు చేశారు.
Next Story