Mon Dec 23 2024 11:50:34 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ - టిడిపి నేతల మధ్య సవాళ్లు.. నూజివీడులో హౌస్ అరెస్ట్ లు
వైసీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, టిడిపి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు సవాళ్లు విసురుకున్నారు
నూజివీడు : వైసీపీ - టిడిపి నేతల మధ్య జరిగిన పరస్పర సవాళ్లతో కృష్ణాజిల్లా నూజివీడులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నూజివీడు నియోజక అభివృద్ధిపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తనతో చర్చించేందుకు రావాలంటూ వైసీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, టిడిపి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు సవాళ్లు విసురుకున్నారు. నేడు నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించేందుకు ఇరు పార్టీల నేతలు సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వైసీపీ-టిడిపి నేతలు, కార్యకర్తల వల్ల నూజివీడులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టి పికెటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే కీలక రాజకీయ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. ముందు జాగ్రత్తగా నూజివీడులో పోలీస్ బలగాలు మోహరించాయి.
Next Story