Mon Dec 23 2024 07:24:29 GMT+0000 (Coordinated Universal Time)
హిందూపురంలో ఉద్రిక్తత.. పుష్ప సినిమా కోసం?
అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాలాజీ థియేటర్ పై అల్లు అర్జున్ అభిమానులు దాడికి దిగారు
అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పుష్ప సినిమా బెనిఫిట్ షో కోసమని థియేటర్ల యాజమాన్యం టిక్కెట్ కు రూ.500లు తీసుకున్నారు. కానీ బెనిఫిట్ షో రద్దయిందని యాజమాన్యం బోర్డు పెట్టడంతో అల్లు అర్జున్ అభిమానులు రెచ్చిపోయారు. థియేటర్ పై దాడికి దిగారు.
అభిమానులపై లాఠీ చార్జి...
హిందూపురంలో బాలాజీ థియేటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రభుత్వం బెనిఫిట్ షోలు వేయవద్దని చెప్పినా పుష్ప సినిమా కోసం యాజమాన్యం డబ్బులు వసూలు చేసింది. దీంతో అభిమానులు థియేటర్ పై దాడికి దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అల్లు అర్జున్ అభిమానులపై పోలీసులు లాఠీ చార్జి చేశారు.
- Tags
- pushpa
- hindupuram
Next Story