Sat Dec 28 2024 18:26:06 GMT+0000 (Coordinated Universal Time)
రుషికొండ వద్ద టెన్షన్... టీడీపీ నేతల అరెస్ట్
విశాఖపట్నం రుషికొండలో ఉద్రిక్తత నెలకొంది. అక్కడ తవ్వకాలు జరుపుతున్నారని తెలుగుదేశం పార్టీ ఆందోళనకు దిగింది.
విశాఖపట్నం రుషికొండలో ఉద్రిక్తత నెలకొంది. అక్కడ తవ్వకాలు జరుపుతున్నారని తెలుగుదేశం పార్టీ ఆందోళనకు దిగింది. మానవహారానికి పిలుపునిచ్చింది. అయితే పోలీసులు ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటున్నారు. రుషికొండ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జి చేసినట్లు తెలిసింది.
పర్యావరణానికి...
విశాఖలోని రుషికొండను తవ్వేస్తున్నారని, పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని టీడీపీ ఈరోజు మానవహారానికి పిలుపు నిచ్చింది. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి నేతృత్వంలో టీడీపీ కార్యకర్తలు రుషికొండ వద్దకు వెళ్లారు. పోలీసులు అడ్డుకుని వారందరినీ అరెస్ట్ చేశారు. సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణం పేరుతో రుషికొండను తవ్వేయడానికి ప్రభుత్వం అనుమతిచ్చిందని, దీనివల్ల పర్యావరణ ముప్పు ఏర్పడుతుందని టీడీపీ నేతలు ఆందోలన వ్యక్తం చేశారు.
Next Story