Wed Jan 15 2025 09:32:22 GMT+0000 (Coordinated Universal Time)
పేటలో ఉద్రిక్తత.. స్పృహతప్పి పడిపోయిన టీడీపీ నేత
నరసరావుపేట జొన్నలగడ్డలో ఉద్రిక్తత తలెత్తింది. వైఎస్సార్ విగ్రహం మాయం కేసులో నిన్న టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు
నరసరావుపేట జొన్నలగడ్డలో ఉద్రిక్తత తలెత్తింది. వైఎస్సార్ విగ్రహం మాయం కేసులో నిన్న టీడీపీ కార్యకర్తలను కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి నిరసనగా ఈరోజు నరసరావుపేట ఇన్ ఛార్జి అరవింద్ బాబు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. టీడీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ అరవింద్ బాబు ధర్నాకు దిగారు.
ఘర్షణ సందర్భంగా....
ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ తలెత్తింది. అరవింద్ బాబును పోలీసులు బూటు కాలితో తన్నగా ఆయన స్పృహతప్పి పడిపోయారు. దీంతో అరవింద్ బాబును చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Next Story