Mon Dec 23 2024 08:53:39 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు ఇంటి వద్ద టెన్షన్
ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి వద్ద టెన్షన్ నెలకొంది. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి వద్ద పోలీసులు భారీ ఎత్తున మొహరించారు
ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి వద్ద టెన్షన్ నెలకొంది. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి వద్ద పోలీసులు భారీ ఎత్తున మొహరించారు. చంద్రబాబు ఇంటికి వెళ్లే మార్గాలన్నింటిలోనూ పోలీసులు మొహరించారు. ప్రజా వేదిక కూల్చివేసి నేటికి మూడేళ్లవుతుండటంతో పెద్దయెత్తున టీడీపీ శ్రేణులు పెద్దయెత్తున అక్కడకు చేరుకుంటున్నాయి.
ప్రజా వేదిక కూల్చి.....
దీంతో చంద్రబాబు ఇంటి వద్ద భారీగా పోలీసులు మొహరించారు. తెలుగుదేశం పార్టీ నేతలు పెద్దయెత్తున వస్తున్నారని తెలియడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నిరసన తెలియజేయడానికి ఎటువంటి అనుమతులు లేవని పోలీసులు చెబుతున్నారు. టీడీపీ శ్రేణులు మాత్రం భారీ ఎత్తున అక్కడకు చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Next Story