Thu Jan 02 2025 13:32:28 GMT+0000 (Coordinated Universal Time)
ఆళ్లగడ్డలో టెన్షన్.. టెన్షన్
ఆళ్లగడ్డలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. భూమా జగద్విఖ్యాత రెడ్డి అరెస్టు చేస్తారన్న ప్రచారంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది
ఆళ్లగడ్డలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. భూమా అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత రెడ్డి అరెస్టు చేస్తారన్న ప్రచారంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగద్విఖ్యాత రెడ్డి ని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఆళ్లగడ్డలో పోలీసులు పెద్దయెత్తున మొహరించడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. దీంతో టీడీపీ శ్రేణులు కూడా పెద్దయెత్తున భూమా అఖిలప్రియ ఇంటి వద్దకు చేరుకున్నాయి.
పోలీసుల విధులకు...
రెండు రోజుల క్రితం భూమా నాగిరెడ్డి పేరుతో నిర్మించిన బస్ షెల్టర్ ను రోడ్డు విస్తరణ పేరుతో కూల్చివేయడంతో దానిని జగద్విఖ్యాతరెడ్డి అడ్డుకున్నారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆందోళనకు దిగారు. దీంతో జగద్విఖ్యాత రెడ్డి పోలీసు విధులకు ఆటంకం కల్గించారని, పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈకేసులో ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవ్వడంతో ఉద్రిక్తత తలెత్తింది.
Next Story