Thu Dec 19 2024 02:59:15 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఏపీ వాసుల మృతి
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలుగు రాష్ట్రానికి చెందిన వారు మృతి చెందారు
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలుగు రాష్ట్రానికి చెందిన వారు మృతి చెందారు. వీరితో పాటు మరో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన వారు మరణించారు. అమెరికాలోని రాండాల్ఫ్ సమీపంలో రెండు వాహనాలు ఢీకొనగా ఇద్దరు చనిపోయారు. చనిపోయిన ముగ్గురు తెలుగు వారు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో ఒక మహిళ కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.
చిత్తూరు జిల్లా వాసులు...
అయితే మరణించిన తెలుగు వారిలో ఇద్దరు శ్రీకాళహప్తికి చెందిన వారని, మరొకరు గూడూరుకు చెందిన వారని చెబుతున్నారు. మృతులను హరితారెడ్డి డేగపూడి, రజినేని చిరంజీవి, గోపి తిరుమూరు గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన సాయి తేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలిసింది. మృతదేహాలను భారత్ కు తరలించాల్సిందిగా కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Next Story