Sun Dec 22 2024 14:46:45 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఏపీలో టెట్ పరీక్ష ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ లో నేడు టెట్ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో నేడు టెట్ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ టెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలను స్వీకరించిన తొలి రోజే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. దాదాపు పదహారు వేల పోస్టులను భర్తీ చేయడానికి సిద్ధం చేసిన ఫైలుపై చంద్రబాబు సంతకం చేశారు.
లోకేష్ చేతుల మీదుగా...
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ పరీక్షకు ముందుగానే టెట్ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉపాధ్యాయ అర్హత పరీక్షలు గత నెల మూడో తేదీ నుంచి 21 వ తేదీ వరకూ జరిగాయి. ఈ టెట్ పరీక్షకు 3.68 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాలను నేడు మంత్రి నారా లోకేష్ విడుదల చేయనున్నారు.
Next Story