Thu Nov 14 2024 19:23:21 GMT+0000 (Coordinated Universal Time)
రెండు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్
ిివిద్యుత్ బిల్లులు బిల్లుల చెల్లింపు విషయంలో టీజీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ కీలక నిర్ణయం తీసుకున్నాయి
విద్యుత్ బిల్లులు బిల్లుల చెల్లింపు విషయంలో టీజీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఫోన్ పే ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని ప్రకటించాయి. ఇటీవల, ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపులకు నిరాకరించాయి. యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని చెప్పాయి. కానీ చాలా మంది వినియోగదారులకు అది కష్ట సాధ్యంగా మారింది. ఎప్పుడైతే ఫోన్, గూగుల్ పే చెల్లింపులు వద్దని చెప్పడంతో గత నెల కరెంట్ బిల్లుల చెల్లింపులు తగ్గిపోయాయి. వినియోగదారులు విద్యుత్తు కార్యాలయాలకు వెళ్లి బిల్లులు చెల్లించేందుకు తగిన సమయం లేకపోవడంతో చెల్లించకుండా నిలిపేశారు.
విద్యుత్లు బిల్లులు తగ్గిపోయి...
దీంతో ఫోన్ పే చెల్లింపులను పునరుద్ధరించినట్లు రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు ప్రకటించారు.రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలకు చెందిన టీజీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ యాప్, వెబ్ సైట్ తో పాటు ఫోన్ పే ద్వారా ప్రస్తుత చెల్లింపులు చేయవచ్చని అధికారులు తెలిపారు. గతంలో వినియోగదారులు ప్రతినెలా విద్యుత్ కార్యాలయాలకు వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడి బిల్లులు చెల్లించేవారు. ఆ తర్వాత డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించారు. వినియోగదారులు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కూడా చెల్లించవచ్చు. అంతా సజావుగా సాగుతున్న తరుణంలో.. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఫోన్ పే, గూగుల్ పే చెల్లింపులు కుదరదని నెల రోజుల క్రితమే డిస్కమ్ లు నిర్ణయం తీసుకున్నాయి.
Next Story