Mon Dec 23 2024 14:22:07 GMT+0000 (Coordinated Universal Time)
చిత్తూరు జిల్లాలో అక్క-తమ్ముడి దారుణ హత్య..?
చిత్తూరు జిల్లాలో యువతి, యువకుడు దారుణ హత్యకు గురవ్వడం కలకలం రేపుతోంది. సదుం మండలం జాండ్రపేటలో యువతి-యువకుడు అనుమానాస్పదంగా మరణించిన ఘటన స్థానికుల్లో అలజడికి కారణమైంది. వాటర్ ప్లాంట్లో పనిచేస్తున్న రాధా, వెంకటేషు శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు బండరాయితో మోది చంపినట్లుగా తెలుస్తోంది.
చిత్తూరు జిల్లాలో యువతి, యువకుడు దారుణ హత్యకు గురవ్వడం కలకలం రేపుతోంది. సదుం మండలం జాండ్రపేటలో యువతి-యువకుడు అనుమానాస్పదంగా మరణించిన ఘటన స్థానికుల్లో అలజడికి కారణమైంది. వాటర్ ప్లాంట్లో పనిచేస్తున్న రాధా, వెంకటేషు శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు బండరాయితో మోది చంపినట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందిన ఇద్దరు మదనపల్లి ప్రాంతానికి చెందిన వారని స్థానికులు తెలిపారు. వీరిద్దరూ ఆ ప్రాంతంలో ఉంటారని తెలిసే ఈ దారుణానికి కొందరు తెగబడ్డారా అని పోలీసులు ఆరాతీస్తున్నారు.
వాటర్ ప్లాంట్లో గత కొద్దిరోజులుగా రాధ, వెంకటేషులు పని చేస్తున్నారు. వీరిద్దరూ అక్కా-తమ్ముడని స్థానికులు తెలిపారు. వీరి తలపై బలమైన గాయాలయ్యాయి. రాత్రి గుర్తు తెలియని దుండగులు బండరాయితో మోది చంపినట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాల కారణంగా రాధ భర్తకు దూరంగా ఉంటోంది. తమ్ముడితో కలిసి జాండ్రపేటలోని వాటర్ ప్లాంట్లో పని చేస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి ఇద్దరూ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story