Mon Dec 23 2024 07:13:18 GMT+0000 (Coordinated Universal Time)
తెరుచుకోని విమానం డోర్లు.. ఫ్లైట్ లో ఎమ్మెల్యే రోజా
హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చే ఇండిగోె విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. తిరుపతి కి సమీపంలో గాలిలో చక్కర్లు కొట్టింది.
హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చే ఇండిగోె విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. తిరుపతి విమానాశ్రయానికి సమీపంలో గాలిలో చక్కర్లు కొట్టింది. దీంతో సాంకేతిక సమస్య తలెత్తిందని భావించిన అధికారులు ఈ విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. అయితే బెంగళూరు విమానాశ్రయంలో ఫ్లైట్ సేఫ్ గా ల్యాండ్ అయింది.
సేఫ్ గా ల్యాండ్ అయినా....
కానీ ఫ్లైట్ ల్యాండ్ అయినా విమానం తలుపులు తెరుచుకోలేదు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇదే విమానంలో ప్రయాణిస్తున్నారు. ఈ విషయాలన్నీ రోజా వీడియో ద్వారా బయట ప్రపంచానికి తెలియజేశారు.
Next Story