Mon Dec 23 2024 18:54:38 GMT+0000 (Coordinated Universal Time)
ఆ ప్రకటనలు నమ్మి మోసపోకండి - టీటీడీ
టీటీడీలో ఉద్యోగ అవకాశాలున్నాయి. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలంటూ ఓ ఫేక్ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ఉద్యోగ అవకాశాలున్నాయి. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలంటూ ఓ ఫేక్ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలా వైరల్ అయిన ప్రకటన టీటీడీ దృష్టికి రావడంతో.. ఈ ప్రకటనపై టీటీడీ స్పందించారు. టీటీడీలో ఉద్యోగాలంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రకటనలను నమ్మి మోసపోవద్దని టీటీడీ సూచించింది.
కఠిన చర్యలు...
ఇలాంటి ఫేక్ ప్రకటన చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా టీటీడీ హెచ్చరించింది. టీటీడీ లో ఉద్యోగాలు ఉంటే తామే పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తామని పేర్కొంది. ఇలాంటి ఫేక్ ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.
Next Story