Sat Apr 05 2025 22:34:29 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి ఇంటర్మీడియట్ బోర్డు ప్రతిపాదనలను పంపింది. థియరీ పరీక్షల కంటే ముందుగానే ప్రాక్టికల్స్ పరీక్షలు పెట్టాలన్న ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది.
షెడ్యూల్ లో మార్పు....
ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే కొత్త షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ ప్రకటించే అవకాశముంది. ఏప్రిల్ 15వతేదీ నుంచి మే 10వ తేదీ వరకూ రెండు విడతలుగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్డు ముందే షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ఇతర పోటీ పరీక్షలకు సమయం సరిపోదని భావించిన విద్యాశాఖ అధికారులు ఈ షెడ్యూల్ లో మార్పులు తేవాలని నిర్ణయించారు. అందుకోసమే ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు. మార్చి 15వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ఏపీలో జరగనున్నాయి. ఈ పరీక్షలు మాత్రం యధాతధంగా జరుగుతాయి. అయితే ప్రాక్టికల్స్ ను మాత్రం మార్చే అవకాశాలున్నాయి.
Next Story