Mon Dec 23 2024 06:25:48 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఏపీలో టీచర్ల బదిలీలకు బ్రేక్
ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్ పడింది. పాఠశాల విద్యాశాఖ కమిషన్ అన్ని జిల్లాల డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు
ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్ పడింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషన్ అన్ని జిల్లాల డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా 1800 మంది టీచర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే బదిలీల్లో పెద్దయెత్తున సిఫార్సులు పనిచేశాయన్న ఆరోపణలు వినిపించాయి.
గత ప్రభుత్వం...
అయితే కొత్త ప్రభుత్వం రావడంతో ఈ బదిలీల ప్రక్రియను వెంటనే నిలిపేసింది. ఉపాధ్యాయ సంఘాల ఆరోపణలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బొత్స సత్యనారాయణ మంత్రిగా ఈ బదిలీ ఉత్తర్వులు ఇచ్చారని, పెద్దయెత్తున పైరవీలు చేశారంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆరోపించడంతో ప్రభుత్వం ఈ బదిలీలకు బ్రేక్ వేసింది.
Next Story