Fri Mar 28 2025 14:55:58 GMT+0000 (Coordinated Universal Time)
TDP : ఐదు పోస్టులు ఖాళీ అవుతున్నా ఆనందం లేదా?
ఆంధ్రప్రదేశ్ లో ఐదు ఎమ్మెల్సీ పోస్టులకు ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై చర్చజరుగుతుంది

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారా? లేదా? అన్నది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. ఐదు ఎమ్మెల్సీ పోస్టులకు షెడ్యూల్ విడుదలయింది. ఎమ్మెల్యే కోటా ఎన్నికలు కావడంత అన్నీ కూటమి ఖాతాలోనే పడనున్నాయి. అందులో మూడు ఆల్రెడీ రిజర్వ్ అయ్యాయన్న ప్రచారం జరుగుతుంది. ఒకటి జనసేన నేత నాగబాబుకు దాదాపుగా కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే ఆయనను మంత్రిమండలిలోకి తీసుకుంటామని ఇప్పటికే ప్రకటించడంతో ఆయనను ఎమ్మెల్సీగా చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మరొక స్థానం నుంచి వంగవీటి రాధాను ఎంపిక చేయాల్సి ఉంది. గత ఎన్నికల సమయంలోనే చంద్రబాబు వంగవీటిరాధాకు హామీ ఇచ్చారు. దీంతో వంగవీటి రాధాకు కూడా ఒక సీటు కన్ఫర్మ్ అయిందని అంటున్నారు.
వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి...
రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై నారా లోకేష్ కూడా సుముఖంగా ఉండటంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి దాదాపు ఖాయమయిందనే చెప్పాలి. ఇక పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన వర్మకు కూడా ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు ఎన్నికలకు ముందు మాట ఇచ్చారు. వర్మకు సామాజికవర్గం కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కుతుందా? లేదా? అన్నది అనుమానంగానే ఉంది. . వర్మ ఇప్పటికే తనకు ప్రయారిటీ ఇవ్వడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల ఆయన పెట్టిన పోస్టుతో అధినాయకత్వం పునరాలోచనలో పడినట్లు తెలిసింది. ఐదు ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటి కూడా ఇవ్వకపోతే వర్మ మరింతగా అసహనం వ్యక్తం చేస్తారు. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
బీజేపీకి ఒకటి ఇస్తే...
ఇక మిగిలిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి బీజేపీకి ఇవ్వాల్సి వస్తుందా? లేదా? అన్నది మాత్రం ఇంకా తేలలేదు. ఇవ్వాల్సి వస్తే మాత్రం తే ఇక మిగిలేది ఒక్కటే. వంగవీటి రాధాకు కనుక ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తే కృష్ణా జిల్లాలో మరొకరికి సీటు కేటాయించే అవకాశముండదు. ఎందుకంటే కృష్ణా జిల్లాలో ఎమ్మెల్సీ స్థానం కోసం బుద్ధా వెంకన్న తో పాటు మరికొందరు నేతలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో దేవినేని ఉమామహేశ్వరరావుకు ఇవ్వాలనుకున్నా జిల్లా అడ్డం వస్తుందంటున్నారు. ఈ ఐదింటిలో ఒకే ఒకస్థానంలో కృష్ణా జిల్లా నేతను ఎంపిక చేస్తారు కాబట్టి రాధాకు తొలి ప్రయారిటీ ఉంటుంది. అయితే కమ్మ సామాజికవర్గం కోటాలో ఇవ్వాలనుకుంటే దేవినేని ఉమకు ఇచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే రాధాకు హ్యాండ్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఎస్సీ సామాజికవర్గానికి...
మరోవైపు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నేతలకు కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సి ఉంటుంది. మాజీ మంత్రి జవహర్ పేరు బలంగా వినపడుతుంది. మరి ఏ జిల్లా నుంచి నేతను ఎంపిక చేస్తారన్నది మాత్రం ఆసక్తికరంగానే మారింది. ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధినాయకత్వంలో మాత్రం ఆనందం లేదు. నేతలు ఎక్కువ. ఖాళీ అయ్యే పోస్టులు తక్కువగా ఉండటంతో కొంత నిర్ణయం తీసుకోవడానికి మాత్రం మల్లగుల్లాలు పడాల్సి ఉంటుంది. అయితే ఐదుగురిలో కొన్ని కూటమిలోని మిత్రపక్షాలకు సీట్లు కేటాయించాల్సి రావడం కూడా పార్టీపరంగా ఇబ్బందికరంగా మారుతుంది. మొత్తం మీద ఆశావహులు మాత్రం బోల్డంత మంది ఉండటంతో ఎవరిని ఎంపిక చేయాలన్నది మాత్రం పార్టీ హైకమాండ్ కు కత్తిమీద సామే.
Next Story