Mon Apr 21 2025 19:35:06 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : నేడు తిరుమలలో రద్దీ ఎంత ఉందో తెలిస్తే .. గోవిందా అనక తప్పదా
తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది

తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కంపార్ట్ మెంట్లలో భక్తులు నిండిపోయి ఉన్నారు. తిరుమలలో ఎక్కడ చూసినా భక్తుల సందడి కనిపిస్తుంది. గోవింద నామ స్మరణలతో మాడ వీధులు మారుమోగిపోతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు వేసవికి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
వేసవి తీవ్రత తగ్గకుండా...
తిరుమలలో భక్తులు వేసవి తీవ్రత తగ్గకుండా కంపార్ట్ మెంట్ల వద్ద ఎయిర్ కూలర్లను ఏర్పాటు చేశారు. ఆలయం నుంచి బయటకు వచ్చే మార్గంలో కార్పెట్లు వేయడంతో పాటు వైట్ పెయింట్ ను వేసి కాళ్లు మాడకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. మాడవీధుల్లో తిరిగే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు. ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఎక్కువ మంది భక్తులు వచ్చారని అధికారులు తెలిపారు.
31 కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడువందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 82,580 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,905 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నాలుగు కోట్ల రూపాయలు వచ్చింది.
Next Story