Tue Apr 22 2025 00:39:43 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో శనివారం భక్తుల రద్దీ నేడు ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శనివారం కావడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు

తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శనివారం కావడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. నేటి నుంచి ఇక భక్తుల రద్దీ ఎక్కువ కానుంది. ఇంటర్, పదో తరగతి ఫలితాలు వెలువడుతుండటంతో ఉత్తీర్ణులయిన వారు తల్లిదండ్రలు, పిల్లలతో కలసి ఏడుకొండల వాడిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమలకు చేరుకుంటారు. ఏప్రిల్ మూడో వారం నుంచి తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరగుతుందని అంచనా వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నారు.
నేడు తుంభూర తీర్థ ముక్కోటి...
నేడు తిరుమలలో తుంభూర తీర్థ ముక్కోటిని నిర్వహించనున్నారు. ఉదయం పది గంటల వరకూ మాత్రమే భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అనుమతించనున్నారు. వేసవి తీవ్ర ఎక్కువగా ఉండటంతో భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మాడ వీధుల్లో వైట్ పెయింట్ వేశారు. చాలా చోట్ల కార్పెట్లు వేసి భక్తులు కాళ్లు కాలిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే సమయంలో కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులకు అవసరమైన మజ్జిగ, మంచినీటిని, అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు.
31 కంపార్ట్ మెంట్లలో....
నేడు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తుకలు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్నతిరుమల శ్రీవారిని 70,462 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,393 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.01 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story