Mon Dec 23 2024 07:48:39 GMT+0000 (Coordinated Universal Time)
TDP : నేడు కూటమి అభ్యర్థి ఎంపికపై కసరత్తు.. ఫైనల్ చేసే అవకాశం
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిపై నేడు క్లారిటీ వచ్చే అవకాశముంది.
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిపై నేడు క్లారిటీ వచ్చే అవకాశముంది. నేడు టీడీపీ నేతలు సమావేశమై అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. నిన్న అభ్యర్థి ఎంపికపై చర్చ జరిపినా ఒక నిర్ణయానికి రాకపోవడంతో ఈరోజు మరోసారి సమావేశమై అభ్యర్థిని ఎంపిక చేయాలని నిర్ణయించారు.
పార్టీ అధినేతకు...
ఇప్పటికే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేయడంతో ఆయనకు ధీటైన అభ్యర్థి కోసం కూటమి నేతలు వెతుకుతున్నారు. అన్ని రకాలుగా బొత్సను తట్టుకునే అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తం మూడు పేర్లతో అభ్యర్థుల పేర్లను రూపొందించి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపించనున్నారు. ఆయన ఈరోజు, రేపట్లో అభ్యర్థిని ఫైనల్ చేయనున్నారని తెలిసింది.
Next Story