Sat Mar 15 2025 18:50:32 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఎవరు ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేసుకునే వీలు
ఏపీలో నూతన మద్యం విధానానికి సంబంధించి ఇవాళ నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశాలున్నాయి

ఏపీలో నూతన మద్యం విధానానికి సంబంధించి ఇవాళ నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 3,736 వైన్ షాపులు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 10 శాతం అంటే రాష్ట్ర వ్యాప్తంగా 340 దుకాణాలను గీత కార్మికులకు కేటాయించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
లైసెన్స్ ఫీజు ఇలా...
అయితే మద్యం దుకాణాల లైసెన్స్ పొందేందుకు ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. పది వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 50 లక్షల రూపాయలు, 50వేల జనాభా ఉంటే లోపు ఉంటే 55 లక్షల రూపాయలు, 5 లక్షలలోపు ఉంటే 65 లక్షల రూపాయలు, 5 లక్షలకు పైన జనాభా ఉంటే 85 లక్షల రూపాయల లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Next Story