Mon Dec 23 2024 13:54:31 GMT+0000 (Coordinated Universal Time)
మూడో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు
మూడు రాజధానుల అంశం పై అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టే అవకాశముంది. ఈ నెల మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి
మూడు రాజధానుల అంశం పై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టే అవకాశముంది. ఈ నెల మూడో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశముంది. అందులో మూడు రాజధానుల బిల్లు ఉందంటున్నారు. న్యాయపరమైన ఇబ్బందులు ఈసారి తలెత్తకుండా న్యాయనిపుణుల సూచన మేరకు ఈ బిల్లులు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.
మూడు రాజధానుల బిల్లు...
ఈ నెల మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలను జరపాలని ప్రభుత్వం భావిస్తుంది. వారం రోజుల పాటు ఈ సమావేశాలను నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 7వ తేదీన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో మూడు రాజధానుల అంశంపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఈసారి మూడు రాజధానుల బిల్లులను ఉభయ సభల్లో ఆమోదించుకుని ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Next Story