Tirumala : తిరుమలలో తగ్గిన రద్దీ .. శనివారం కూడా ఇదేంటి?
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. శనివారం అయినా సరే భక్తులు అంతంత మాత్రంగానే ఉంది
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. శనివారం అయినా సరే భక్తులు అంతంత మాత్రంగానే ఉండటం విస్మయం కలిగించే అంశమే. ఎందుకంటే శనివారం తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. శని, ఆదివారాల్లో క్యూ లైన్లు బయట వరకూ ఉంటాయి. కానీ నేడు మాత్రం కంపార్ట్ మెంట్లన్నీ ఖాళీగా ఉండటం కూడా కనిపించడం ఆశ్చర్యం కనిపిస్తుంది. అయితే తిరుపతి, తిరుమలలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉందని చెప్పాలి. గత రెండు రోజుల నుంచి తిరుమలలోనూ భారీ వర్షం కురుస్తుంది. ఘాట్ రోడ్డులో ప్రయాణం కూడా ప్రమాదకరంగా మారింది. కొండ చరియలు విరుచుకుపడే అవకాశముందని, వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పదే పదే హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు పాపవినాశనం కూడా మూసివేశారు. ఆకాశగంగ వద్దకు కూడా ఎవరినీ రానివ్వడం లేదు. దీంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య శనివారం తగ్గడానికి భారీ వర్షాలే కారణమని అధికారులు చెబుతున్నారు.