Tue Dec 03 2024 18:11:45 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో నేడు భక్తులకు నేరుగా దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. స్వామి వారి దర్శనానికి నేరుగా వెళ్లే అవకాశం ఉంది
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. స్వామి వారి దర్శనానికి నేరుగా వెళ్లే అవకాశం ఉంది. వేచి ఉండకుండానే దర్శనం లభిస్తుంది. బుధవారం కావడంతో తిరుమలలో భక్తుల సంఖ్య తక్కువగా ఉంది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ ప్రకటించడంతో భక్తుల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుందని సంఖ్య తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎవరూ తిరుమలకు వచ్చేందుకు సుముఖత చూపటం లేదు. మరో వైపు రైళ్లు, బస్సుల రాకపోకలు కూడా నిలిచి పోయే అవకాశముండటంతో భక్తులు భయపడి తమ ప్రాంతాల నుంచి బయటకువచ్చేందుకు జంకుతున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది.
గత కొద్ది రోజులుగా...
తిరుమల గత కొద్ది రోజులుగా ఖాళీగా ఉంది. భక్తుల సంఖ్య పెద్దగా లేదు. ప్రధానంగా వరస తుపానులు తిరుమలకు భక్తుల సంఖ్యను తగ్గిస్తుందనే చెప్పాలి. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు ఖాళీగానే ఉన్నాయి. భక్తులు వేచి ఉండకుండానే స్వామి వారి దర్శనం చేసుకుంటున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఈరోజు ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 64,359 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 20,711 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.59 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story