Wed Oct 30 2024 23:20:57 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : నేడు నేరుగా దర్శనం...వేచి ఉండకుండానే
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. నిన్న రధసప్తమి కావడంతో ఎక్కువ సంఖ్యలో ఉన్న భక్తులు నేడు శనివారం అయినా పెద్దగా లేరు
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. నిన్న రధసప్తమి కావడంతో ఎక్కువ సంఖ్యలో ఉన్న భక్తులు నేడు శనివారం అయినా భక్తులు పెద్ద సంఖ్యలో లేరు. క్యూలైన్ లలో ఆగకుండా నేరుగా శ్రీవారిని దర్శించుకంటున్నారు భక్తులు. సాధారణంగా శనివారం భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అయితే పరీక్షల సీజన్ ప్రారంభం కావడం, పెళ్లిళ్లు కూడా జరుగుతుండటంతో తిరుమలలో శనివారం కూడా భక్తుల రద్దీ అంతంత మాత్రంగానే ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 77,483 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిలో 19,276 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం మూడు కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగానే భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు దర్శనం ఎనిమిది గంటలు పడుతుంది.
Next Story