Mon Dec 23 2024 06:02:11 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : నేరుగా స్వామి వారి దర్శనం
తిరుమలలో భక్తులు రద్దీ లేదు. భక్తుల సంఖ్య తక్కువగానే ఉంది. తుఫాను ప్రభావంతో క్యూ లైన్ లన్నీ ఖాళీగానే ఉన్నాయి
తిరుమలలో భక్తులు రద్దీ లేదు. భక్తుల సంఖ్య తక్కువగానే ఉంది. తుఫాను ప్రభావంతో క్యూ లైన్ లన్నీ ఖాళీగానే ఉన్నాయి. శ్రీవారి దర్శనానికి భక్తులు వేచి చూడకుండా నేరుగా దర్శనానికి వెళుతున్నారు. తుఫాను ప్రభావంతో అన్ని రాష్ట్రాలూ భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. దీంతో తిరుమల భక్తులు రాక తక్కువగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
తుఫాను ప్రభావంతో...
నిన్న తిరుమల శ్రీవారిని 44,547 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 13,125 మంది తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.25 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఈరోజు నేరుగా తిరుమల శ్రీవారిని దర్శించుకునే వీలుంది. క్యూ లైన్ లో వేచి చూడకుండానే నేరుగా స్వామి దర్శనం పూర్తవుతుంది. సర్వదర్శనం క్యూ లైన్లో ఉన్న భక్తులకు మాత్రం దర్శనానికి ఏడు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.
Next Story