Tirumala : శనివారం.. తిరుమలలో భక్తుల రద్దీ తక్కువే.. రీజన్ ఇదేనట
తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేదు. శనివారమయినా భక్తుల సంఖ్య స్వల్పంగానే ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేదు. శనివారమయినా భక్తుల సంఖ్య స్వల్పంగానే ఉంది. అధికారుల అంచనాలకు భిన్నంగా శనివారం భక్తుల సంఖ్య ఒక్కసారిగా తగ్గింది. ఈరోజు తిరుమలలో వెంకటేశ్వరుడి దర్శనం సులువుగా జరుగుతుంది. ఏడుకొండల వాడిని చూసేందుకు ఎక్కువ సేపు పట్టడం లేదు. దర్శనం త్వరగా పూర్తి అవుతుండటంతో భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సహజంగా శుక్ర, శని, ఆదివారాలు తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. శనివారం వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే మంచిదని, శుభప్రదమని, దానిని సెంటిమెంట్ గా అందరూ భావిస్తారు. ఎక్కువ మంది తిరుమల వెంకటేశ్వరుడిని శనివారమే దర్శించుకోవాలని తపన పడుతుంటారు. శనివారం అంటే వెంకటేశ్వరస్వామిక అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. అందుకే శని, ఆదివారాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు. భక్తులు ఎలంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటారు. కానీ ఈ శనివారం మాత్రం భక్తుల రద్దీ తగ్గడంపై అధికారుల అంచనాకు మాత్రం అందడం లేదంటున్నారు.