Sat Nov 23 2024 12:21:09 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో నేడు కూడా తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేదు. గురువారం కూడా భక్తులు రద్దీ అంతంత మాత్రంగానే ఉంది
తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేదు. గురువారం కూడా భక్తులు రద్దీ అంతంత మాత్రంగానే ఉంది. నిన్నటి నుంచి తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేదు. ఎండలు మండి పోతుండటంతో భక్తుల సంఖ్య తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ముందుగా బుక్ చేసుకున్న వారు మాత్రమే తిరుమలకు చేరుకుంటున్నారు. తిరుమలలో వసతిగృహాలు కూడా సులువుగానే భక్తులకు అందుబాటులో ఉన్నాయి. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు గంటల సమయంలో శ్రీవారి దర్శనం పూర్తవుతుంది.
ఎనిమిది గంటలు...
నిన్న తిరుమల శ్రీవారిని 61,087 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,530 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.34 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈరోజు తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని నాలుగు కంపార్ట్మెంట్లలోనే భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుంది.
Next Story