Mon Dec 23 2024 03:06:46 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : శనివారం తగ్గిన రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేదు. శనివారం అయినా సరే భక్తుల రద్దీ అంతగా లేదు
తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేదు. శనివారం అయినా సరే భక్తుల రద్దీ అంతగా లేదు. సాధారణంగా శని, ఆదివారాలు భక్తులతో తిరుమల కిటకిటలాడుతుంటుంది. క్యూ లైన్లన్నీ నిండిపోతాయి. స్వామి వారి దర్శనానికి గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. ప్రతి వీకెండ్లోనూ ఇదే పరిస్థిితి. శని, ఆదివారాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని తెలిసి, అన్న ప్రసాదంతో పాటు మంచినీరు వంటి అందించే కార్యక్రమాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చేపడుతుంది.
ఆదాయం మాత్రం...
అయితే ఈరోజు రద్దీ సాధారణంగానే ఉంది. తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని మూడు కంపార్ట్మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్లోకి టెకెన్లు లేని భక్తులకు దర్శన సమయం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 65,422 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,778 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.30 కోట్ల రూపాయలు వచ్చింది.
Next Story