Sat Nov 23 2024 07:14:46 GMT+0000 (Coordinated Universal Time)
మూడు గంటల్లోనే స్వామి వారి దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేదు. కేవలం మూడు గంటల్లోనే స్వామి వారి దర్శనం పూర్తవుతుంది
తిరుమలలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సింహవాహనంపై స్వామి వారు మాడ వీధుల్లో ఊరేగుతున్నారు. దీంతో మాడవీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. యోగనృసింహుని అలంకారంలో స్వామి వారు దర్శనమిస్తుండటంతో భక్తులు చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. భక్తుల ఈతి బాధలను తొలిగించే అలంకారంగా భక్తులు భావిస్తారు. సప్తగిరులపై నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేసింది.
బ్రహ్మోత్సవాల సమయంలోనూ...
ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగానే ఉంది. అయితే సర్వదర్శనానికి కేవలం మూడు గంటల సమయం మాత్రమే పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కేవలం ఐదు కంపార్ట్మెంట్లలోనే భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 73,859 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,634 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.31 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story