Fri Nov 22 2024 23:30:31 GMT+0000 (Coordinated Universal Time)
దర్శనానికి రెండు గంటలే
తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేదు. సాధారణంగానే భక్తుల సంఖ్య ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేదు. సాధారణంగానే భక్తుల సంఖ్య ఉంది. వరస పెలవులు ముగియడంతో భక్తులు రాక కూడా తగ్గింది. దీంతో పెద్దగా సమయం లేకుండానే భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా గంటల కొద్దీ శ్రీవారి దర్శనం కోసం వేచి చూసిన భక్తులకు నేడు మాత్రం పెద్దగా వేచి చూడకుండానే దర్శనం లభిస్తుంది.
రద్దీ సాధారణం...
నిన్న తిరుమల శ్రీవారిని 70,515 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 27,230 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.23 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అయితే నేడు శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కేవలం రెండు కంపార్ట్మెంట్లలోనే భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు కూడా కేవలం రెండు గంటల్లోనే దర్శనం లభిస్తుంది.
Next Story