Tiruamala : తిరుమలలో భక్తుల రద్దీ ఈరోజు ఎలా ఉందంటే?
తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎక్కువగా లేదు. చాలా తక్కువగానే ఉంది. సోమవారం కావడంతో భక్తుల సంఖ్య తక్కువగా ఉంది.
తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎక్కువగా లేదు. చాలా తక్కువగానే ఉంది. సోమవారం కావడంతో భక్తుల సంఖ్య తక్కువగా ఉంది. ధనుర్మాసంలో తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ధనుర్మాసంలో తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకుంటే తమ కష్టాలు తీరతాయని భక్తులు విశ్వసిస్తారు. తిరుమలను సందర్శించుకోవడానికి ఈ నెల ఎంతో మంచిదని పండితులు కూడా చెబుతుండటంతో ఈ సీజన్ లో ఎక్కువ మంది భక్తులు తరలి వస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ముందుగా అంచనా వేసి అన్ని ఏర్పాట్లను చేశారు. దర్శనం కూడా సులువుగా భక్తులు సందర్శించేందుకు వీలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గత మూడు రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ అంతగా లేదు.శని,ఆదివారాలు కూడా భక్తులు తిరుమలకు అత్యంత తక్కువ సంఖ్యలోనే రావడంతో అధికారుల కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల వీధులన్నీ బోసి పోయి కనిపిస్తున్నాయి. నిత్యం భక్తుల రద్దీతో కళకళలాడే అన్నదాన సత్రం వద్ద కూడా భక్తుల రద్దీ పెద్దగా లేదు. అలాగే లడ్డూ కౌంటర్ల వద్ద కూడా భక్తుల రద్దీ తక్కువగానే ఉండటంతో వాటి తయారీ సంఖ్యను కూడా టీటీడీ తగ్గించినట్లు తెలిసింది. అయితే లడ్డూలను ఇతర ప్రాంతాలకు పంపడానికి కూడా తయారు చేస్తుండటంతో స్వల్ప సంఖ్యలోనే లడ్డూల తయారీ తగ్గించామని అధికారులు చెబుతున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ