Sun Nov 24 2024 05:48:10 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : నేడు భక్తుల రద్దీ అంతంత మాత్రమే.. కారణమిదే
తిరుమలలో నేడు భక్తుల రద్దీ పెద్దగా లేదు. మంగళవారం కావడంతో భక్తుల సంఖ్య తక్కువగానే ఉంది
తిరుమలలో నేడు భక్తుల రద్దీ పెద్దగా లేదు. మంగళవారం కావడంతో భక్తుల సంఖ్య తక్కువగానే ఉంది. పరీక్షల ఫలితాల రావడంతో కొంత భక్తుల సంఖ్య మెరుగ్గా ఉన్నప్పటికీ అనుకున్నంత స్థాయిలో మాత్రం తిరుమలలో భక్తుల సంఖ్య లేదు. కంపార్ట్మెంట్లలో దాదాపు అన్నీ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఆదాయం మాత్రం...
నేడు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని నాలుగు కంపార్ట్మెంట్లలోనే భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి పది గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 77,511 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,553 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.28 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story