Mon Dec 23 2024 14:31:25 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్పై ఉత్కంఠ
విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్స్ విషయంలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. బిడ్డింగ్ దాఖలు చేయడానికి నేటితో గడువు ముగియనుంది
విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్స్ విషయంలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. బిడ్డింగ్ దాఖలు చేయడానికి నేటితో గడువు ముగియనుండటతో కార్మికులు ఉత్కంఠతతో ఎదరు చూస్తున్నారు. సింగరేణి కాలరీస్ యాజమాన్యం కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద బిడ్ దాఖలు చేయడానికి సిద్ధపడింది. సింగరేణి డైరెక్టర్లు, అధికారులు వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారులతో చర్చించి వెళ్లారు.
దశల వారీ ఆందోళన...
అయితే చివరి రోజైనా సింగరేణి యాజమాన్యం బిడ్ దాఖలు చేస్తుందా? లేదా? అన్నది కార్మిక సంఘాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఆన్లైన్ దరఖాస్తులను కోరడాన్ని నిరసిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు దశల వారీగా ఆందోళనకు పిలుపు నిచ్చాయి. ఈ నెల 26న వామపక్ష పార్టీల నేతృత్వంలో అక్కడ సభను నిర్వహించాలని నిర్ణయించాయి. అలాగే మే 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ అంతటా రాస్తారోకో నిర్వహించాలని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల అఖిలపక్షం నిర్ణయించింది.
Next Story