Sat Dec 21 2024 13:15:15 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద టెన్షన్
మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది.
మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. జోగి రమేష్ ఇంటిపై తెలుగుదేశం పార్టీ నేతలు దాడికి దిగుతారని నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన ఇంటి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆయన ఇంటి చుట్టూ ముళ్లకంచెలను ఏర్పాటు చేశారు.
టీడీపీ కార్యకర్తలు...
గతంలో జోగి రమేష్ చంద్రబాబు ఉండవల్లి నివాసం వద్దకు వెళ్లి దాడికి ప్రయత్నించారని, అందుకు ప్రతిగా ఆయన ఇంటిపై దాడికి టీడీపీ కార్యకర్తలు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా అన్ని మార్గాలలో పోలీసులు బందోబస్తును నిర్వహిస్తున్నారు.
Next Story