Mon Dec 23 2024 12:56:32 GMT+0000 (Coordinated Universal Time)
అనంతపురంలో ఉద్రిక్తత
అనంతపురంలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతపురంలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకున్నందుకు ఆయనను అరెస్ట్ చేశారు. రోడ్డు విస్తరణలో భాగంగా కలెక్టరేట్ ఎదుట ఉన్న ఫాదర్ ఫెర్రర్ విగ్రహాన్ని అధికారులు తొలగించారు. ఈ విగ్రహాన్ని మళ్లీ ఏర్పాటు చేయాలని ఆయన భూమి పూజ చేయడానికి వచ్చారు.
విగ్రహాన్ని....
రోడ్డు విస్తరణ జరుగుతుందని, విగ్రహాన్ని మరోచోట ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. విగ్రహాన్ని అక్కడే ఏర్పాటు చేయాలని ప్రభాకర్ చౌదరి డిమాండ్ చేస్తున్నారు. అరెస్టయిన ప్రభాకర్ చౌదరి పోలీస్ స్టేషన్ లోనూ ఆందోళన చేపట్టారు. పోలీస్ స్టేషన్ ఎదుట ప్రభాకర్ చౌదరి అనుచరులు, టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు.
Next Story