Mon Dec 23 2024 09:00:48 GMT+0000 (Coordinated Universal Time)
రోడ్డుపై లోకేష్ బైఠాయింపు
శ్రీకాకుళంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను పలాస వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.
శ్రీకాకుళం పట్టణంలోని కొత్త రోడ్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను పలాస వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే లోకేష్ బైఠాయించారు. పలాస పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. లోకేష్ వాహనం వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీగా మొహరించారు.
శ్రీకాకుళంలో ఉద్రిక్తత...
దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్థంభించిపోయింది. పోలీసు ఉన్నతాధికారులతో మాజీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు చర్చలు జరుపుతున్నారు. పలాసలో కొందరు టీడీపీ సానుభూతిపరుల ఇళ్లను కూల్చివేయడంతో వారిని పరామర్శించేందుకు పలాస వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. శ్రీకాకుళం పట్టణం రోడ్డులో భారీగా పోలీసులు మొహరించారు. పెద్దయెత్తున టీడీపీ కార్యకర్తలు కూడా రావడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Next Story