Sun Dec 22 2024 23:55:36 GMT+0000 (Coordinated Universal Time)
Tadipathri : తాడిపత్రి తగ్గేదేలేదంటుందిగా... నేతలందరూ రహస్య ప్రాంతాల్లోకి
తాడిపత్రిలో టెన్షన్ నెలకొంది. నేతలందరినీ పోలీసులు రహస్య ప్రాంతాలకు తరలించారు.
తాడిపత్రిలో నేతలందరినీ పోలీసులు రహస్య ప్రాంతాలకు తరలించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ని రహస్య ప్రాంతానికి పోలీసులు తీసుకెళ్లినట్టు చెబుతున్నారు.పెద్దారెడ్డి ఇంటికి తాళాలు, గేట్లు కూడా బంద్ చేశారు.నిన్న జరిగిన దాడిలో కేతిరెడ్డి వాహనాలను టిడిపి కార్యకర్తలు ధ్వంసం చేశారు. ధ్వంసమైన కార్లను ఇంటి దగ్గరే వదిలి రహస్య ప్రాంతానికి కేతిరెడ్డి వెళ్లిపోయారు. కేతిరెడ్డి ఇంటివద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. ఆయన ఇంటిదగ్గర భారీగా రాళ్లు, కట్టెలు బీతావాహంగా పరిస్థితి కనిపిస్తుంది.
ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి...
ట్రాక్టర్లకు కొద్ది రాళ్లు కుప్పలుగా ఇరువర్గాలు పోసకుని దాడులకు దిగేందుకు సిద్ధంగా ఉన్నాయని భావించిన పోలీసులు వాటిని జేసీబీల సాయంతో ట్రాక్టర్ల ల తో బండ రాళ్ళను తరలిస్తున్నారు. ఇందుకు మున్సిపాలిటీ సిబ్బందిని వినియోగిస్తున్నారు. మళ్లీ హింస చెలరేగే ప్రమాదం ఉండటంతో టీడీపీ, వైసీపీ నాయకులను వేరే ప్రాంతాలకు తరలించారు. పెద్దిరెడ్డితో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి రహస్య ప్రాంతానికి వెళ్లిపోయారు. వారి సెల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయ్యాయి.
Next Story