Sat Nov 23 2024 01:00:13 GMT+0000 (Coordinated Universal Time)
Delhi : నీటి సంక్షోభం మరో టర్న్ తీసుకుందిగా
దేశ రాజధాని ఢిల్లీలో నీటి సమస్య తీరడం లేదు. తాగు నీటి కోసం జనం అల్లాడి పోతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో నీటి సమస్య తీరడం లేదు. తాగు నీటి కోసం జనం అల్లాడి పోతున్నారు. ట్యాంకర్ వస్తే చాలు ఘర్షణలు జరుగుతున్నాయి. అయితే ఢిల్లీలో నీటి కొరతపై భారతీయ జనతా పార్టీ ఆందోళనకు దిగింది. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ నగరానికి సరిపడా నీళ్లు ఇవ్వడం లేదని ఆమ్ ఆద్మీపార్టీనేత, మంత్రి అతిషి నిరవధిక దీక్షకు దిగారు.
ఒకరిపై ఒకరు...
దీనికి పోటీగా బీజేపీ కూడా ఆందోళనకు దిగింది. ఢిల్లీలో నీటి సమస్య కు కారణం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ వైఖరి కారణమంటూ శనివారం ఢిల్లీలోని ఓక్లాలోని జల్ బోర్డు వద్ద ధర్నాకుదిగారు. అయితే పెద్ద సంఖ్యలో వచ్చిన బీజేపీ కార్యకర్తలను నిలువరించడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. వారిపై వాటర్ క్యానన్ లను ప్రయోగించి అక్కడి నుంచి పంపించి వేశారు.కేంద్రంలో బీజేపీ, ఢిల్లీ ఆప్ అధికారంలో ఉండగా ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడమే తప్ప నీటి కొరత తీర్చడానికి ప్రయత్నాలు చేయడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Next Story