Mon Dec 23 2024 00:06:12 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం
విశాఖపట్నంలో అగ్ని ప్రమాదం జరిగింది. స్టీల్ ప్లాంట్ లోని కోకోవెన్ విభాగంలో ఉన్న నాఫ్తలీన్ యూనిట్ లో ప్రమాదం జరిగింది
విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ లోని కోకోవెన్ విభాగంలో ఉన్న నాఫ్తలీన్ యూనిట్లో ప్రమాదం చోటుచేసుకుంది. వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పు రవ్వలు ఎగసి పడి నాఫ్తలీన్ దగ్ధమైంది. భారీగా మంటలు చెలరేగి యంత్రాలు, విద్యుత్ పరికరాలు పూర్తిగా కాలిపోయాయి.
మంటలను ఆర్పేందుకు...
భారీగా ఆస్తినష్టం జరిగినట్టు ప్రాధమికంగా అందిన సమాచారాన్ని బట్ట తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేసేందుకు శ్రమిస్తున్నారు. ఆస్తి నష్టం ఎంత అనేది ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపడతామని స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు తెలిపారు.
Next Story