Mon Dec 15 2025 06:19:28 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ మంత్రి పుష్పశ్రీవాణి ఇంట విషాదం
మాజీ మంత్రి పుష్పశ్రీవాణి ఇంట విషాదం నెలకొంది. పుష్పశ్రీవాణి తండ్రి నారాయణమూర్తి నిన్న రాత్రి మరణించారు.

మాజీ మంత్రి పుష్పశ్రీవాణి ఇంట విషాదం నెలకొంది. పుష్పశ్రీవాణి తండ్రి నారాయణమూర్తి నిన్న రాత్రి మరణించారు. గుండెపోటు రావడంతో ఆయన మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం దొరమామిడిలో నారాయణ మూర్తి మరణించారు. ఆయన విజయనగరం జిల్లా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఆయన అందరికి తలలో నాలుకగా ఉన్నారని అంటారు.
గుండెపోటుతో...
నారాయణమూర్తికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె తులసి జర్మనీలో ఉన్ారు. రెండో కుమార్తె మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పుష్పశ్రీవాణి. మూడో కుమార్తె సృజన విజయనగరం జిల్లాలోనే నివాసం ఉంటున్నారు. కుమారుడు పృథ్వీరాజ్ టీచర్ గా ఉన్నారు. ఆయన జంగారెడ్డి గూడెంలో పనిచేస్తున్నారు. రమణమూర్తి కుటుంబంలో పుష్ప శ్రీవాణి కుటుంబంలో విషాదం నెలకొంది.
Next Story

