Mon Jan 13 2025 05:41:14 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ఎమ్మెల్యే కారుపై బాంబు దాడి
వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై హత్యాయత్నం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారుపై బాంబు విసిరారు
వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై హత్యాయత్నం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారుపై బాంబు విసిరారు. అయితే అది పేలకపోవడంతో ఎమ్మెల్యే తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే శంకర నారాయణపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు.
పేలక పోవడంతో....
బాంబు దాడి చేశారు. అయితే అదృష్టవశాత్తూ బాంబు పేలలేదు. ఒక దుండగుడు శంకరనారాయణ కారుపై బాంబు దాడి చేసినట్లు తెలిసింది. గోరంట్ల మండలం గడ్డం తండాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. బాంబు దాడి చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు.
Next Story