Mon Dec 23 2024 11:35:31 GMT+0000 (Coordinated Universal Time)
Breaking కిందపడి పోయిన తారకరత్న : లోకేష్ పాదయాత్రలో అపశృతి
తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. తారకరత్న కిందపడి స్పృహతప్పారు
తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. పాదయాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికే తారకరత్న వాహనంపై నుంచి కింద పడిపోయారు. పడిపోయిన తారకరత్న స్పృహతప్పి పడిపోయారు. తారకరత్నను వెంటనే కుప్పంలోని కేసీ ఆసుపత్రికి తరలించారు. తారకరత్నకు స్వల్ప గాయాలయినట్లు తెలిసింది.
ఆసుపత్రిలో చేరిక...
వాహనం కదలడంతో ఆయన తూలి కిందపడ్డారని తెలిసింది. నారా లోకేష 11.03 గంటలకు పాదయాత్రను కుప్పం నుంచి ప్రారంభించారు. మధ్యాహ్నం మూడు గంటలకు బహిరంగసభలో మాట్లాడాల్సి ఉంది. పాదయాత్ర ప్రారంభమైన గంటకే తారకరత్న వాహనంపై నుంచి పడటంతో టీడీపీ నేతలు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.
Next Story