Thu Dec 19 2024 22:51:54 GMT+0000 (Coordinated Universal Time)
చిడతలతో అసెంబ్లీకి టీడీపీ సభ్యులు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభలోకి తెలుగుదేశం పార్టీ శాసససభ్యులు చిడతలతో వచ్చారు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభలోకి తెలుగుదేశం పార్టీ శాసససభ్యులు చిడతలతో వచ్చారు. నిన్న ఈలలతో సభలోకి వచ్చిన టీడీపీ సభ్యులు ఈరోజు చిడతలతో రావడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు అతిగా వ్యవహరిస్తున్నారని, సభా సంప్రదాయాలను పాటించడం లేదని స్పీకర్ ఫైర్ అయ్యారు. చిడతలను అసెంబ్లీలో వాయిస్తుండటంతో కొంత గందరగోళం ఏర్పడింది.
సస్పెండ్ చేయండి...
చిడతలు వాయించడంతో స్పీకర్ టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ చీప్ లిక్కర్ కి ఏపీలో ఆద్యుడు నిష్టదరిద్రుడు చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబుకు బ్రెయిన్ పనిచేయక పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తున్నారన్నారు. సభలోకి చిడతలు తీసుకొచ్చి సంప్రదాయాలను తుంగలో తొక్కిన వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, జోగి రమేష్ లు స్పీకర్ ను కోరారు.
Next Story